తెలుగు లింగాష్టకం

Lingashtakam in telugu

 • లింగాష్టకం పరమశివుడి ప్రార్థనా స్తోత్రము.
 • లింగాష్టక స్తోత్రం హిందువులచే ఎక్కువగా చదవబడే స్తోత్రాలలో ఒకటి.
 • లింగాష్టకం మొత్తం ఎనమిది చరణాలను కలిగి ఉంటుంది, ఇందులో ప్రతి చరణము పరమశివుడిని స్తుతిస్తూ వ్రాయబడి ఉంటుంది.
 • లింగాష్టక స్తోత్రాన్ని తరుచుగా చదవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది, మరియు చెడు మరియు చెడ్డ అలవాట్ల నుండి క్రమంగా దూరం అవుతారు.
 • లింగాష్టక స్తోత్రాన్ని గొప్ప భక్తితో పఠించడం వలన శివలోకాన్ని చేరుతారని పెద్దల నమ్మకం.
 • లింగాష్టకం, లింగాష్టకం యొక్క తెలుగు అర్థం క్రింద ఇవ్వబడినది.లింగాష్టకం తెలుగులో

Lingashtakam telugu lyrics

shiva-lingashtakam-lyrics-in-telugu

"Lingashtakam Image Download"

"Lingashtakam telugu pdf file"

"Download Telugu Lingashtakam mp3"

∗ లింగాష్టకం యొక్క తెలుగు అర్థం క్రింద ఇవ్వబడినది.

తెలుగు హనుమాన్ చాలీసా    తెలుగు లింగాష్టకం    వరలక్ష్మీ వ్రతం    శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము    మరిన్ని ..   

లింగాష్టకం అర్థం తెలుగులో

Shiva Lingashtakam Meaning in telugu

బ్రహ్మమురారి సురార్చిత లింగం
బ్రహ్మ విష్ణు దేవతలచే పూజింపబడే లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
నిర్మలమైన మాటలతో శోభించబడిన లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
జన్మ వల్ల పుట్టే దుఃఖాలను నాశనం చేసే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[1]దేవముని ప్రవరార్చిత లింగం
దేవమునులు ఋషులు పూజించే లింగం
కామదహన కరుణాకర లింగం
కామాన్ని దహనం చేసి, కరుణను చూపే చేతులుగల లింగం
రావణ దర్ప వినాశన లింగం
రావణుని గర్వాన్ని నాశనం చేసిన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[2]

సర్వ సుగంధ సులేపిత లింగం
అన్ని గంధాలు చక్కగా పూసిన లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
బుద్ధివికాసానికి కారణమైన లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
సిద్దులు దేవతలు రాక్షసులచే కీర్తింపబడే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[3]

కనక మహామణి భూషిత లింగం
బంగారు మహామునులచే అలంకరింపబడే లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం
నాగరాజు నివాసంచే అలంకరింపబడే లింగం
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేసిన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[4]కుంకుమ చందన లేపిత లింగం
కుంకుమ గంధము పూయబడిన లింగం
పంకజ హార సుశోభిత లింగం
కాలువల హారంచే శోభించబడే లింగం
సంచిత పాప వినాశన లింగం
సంక్రమించిన పాపాలన్నీ నాశనం చేసే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[5]

దేవగణార్చిత సేవిత లింగం
దేవగణాల చేత పూజింపబడే సేవించబడే లింగం
భావైర్భక్తిభిరేవచ లింగం
భావంచే కూడిన భక్తిచే పూజింపబడే లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
కోటి సూర్యుల కాంతిచే వెలిగిపోయే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[6]

అష్టదళోపరివేష్టిత లింగం
ఎనమిది రకాల ఆకులపై నివసించే లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అన్నీ సరిగ్గా ఉద్బవించాడని కారణమైన లింగం
అష్టదరిద్ర వినాశన లింగం
అష్ట దారిద్య్రాలను నాశనం చేసి లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[7]

సురగురు సురవర పూజిత లింగం
దేవతల గురువు దేవతలు పూజించే లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
దేవతల తోటల్లోని పుష్పాలచే పూజింపబడే లింగం
పరాత్పరం పరమాత్మక లింగం
నీ సన్నిధియే ఒక స్వర్గం లింగమా
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[8]

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
లింగాష్టకాన్ని శివుడి సన్నిధిలో చదివితే పుణ్యం వొస్తుంది
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే
శివలోకం లభిస్తుంది శివుడిలో ఐక్యమవడానికి మార్గం దొరుకుతుంది

తెలుగు హనుమాన్ చాలీసా    తెలుగు లింగాష్టకం    వరలక్ష్మీ వ్రతం    శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము    మరిన్ని ..   About lingashtakam

 • Lingashtakam is a prayer stotra of lord shiva.
 • Lingashtakam is one of the famous stotras of hindu community.
 • Lingashtakam totally has eight stanzas in it, each stanza in lingashtakam praises the lord "shiva".
 • Regular reading of lingastaka stotram will give piece and keeps away from negative thoughts and bad thoughts.
 • It is believed that people will reach "shivalokam" if they read lingashtakam with a grate devotion (after their life).

Lingashtakam mp3 song

Listen/Download lingastakam audio song (brahma murari surarchita lingam mp3 audio)
[by S.P.Balasubramanyam] from the link bellow
Lingashtakam mp3 song

తెలుగు లింగాష్టకం    వరలక్ష్మీ వ్రతం    శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము    తెలుగు హనుమాన్ చాలీసా    మరిన్ని ..