Telugu Ayurveda Chitkalu

Ayurvedic Tips in Telugu

తల నొప్పి :

» హారతి కర్పూరము, మంచి గంధము రెండింటినీ సమ భాగాలుగా కలిపి నూరి నుదుటిపై రాస్తే తలనొప్పి తగ్గిపోతుంది.

» చిన్న యాలకుల చూర్ణం ముక్కుపొడుములా పీల్చడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.

» నిమ్మకాయ రసంలో బెల్లం, ఉప్పు కలిపి నూరి పట్టువేస్తే తలనొప్పి తగ్గిపోతుంది.


కాలు, చేతి పగుళ్లు :

» ఆవనూనె, గుగ్గిలము లను సమానంగా తీసుకొని కొద్దిగా ఆ మిశ్రమానికి నీటిని కలిపి ముద్దలా చేసి పగుళ్ళకు రాసినట్లయితే పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి.

» కొబ్బరి పాలలో కొంచెం గ్లిజరిన్ ను కలిపి రాస్తే పగుళ్లు తగ్గిపోతాయి.

» నెయ్యి, బెల్లం, గుగ్గిలము లను సమానంగా కలిపి రాస్తే కాళ్ళ పగుళ్లు తగ్గిపోతాయి.



ఎక్కిళ్ళు :

» వాము, మిరియాలను సమానంగా తీసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలిపి నిప్పుల మీద వేసి ఆ పొగను పీలిస్తే ఎక్కిళ్ళు పోతాయి.

» తమలపాకులో కుంకుమ పువ్వు వేసి నమిలి మింగితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

» చేరుకురసం లేదా వేడి ఆవు పాలు తాగటం వల్ల ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

Page-4