Articles

(ఆర్టికల్స్)
(Lesson-3)
↶Previous Next↷

Articles:

A, An, The లను Articles అని అంటారు.

A లేదా An అంటే "ఒక" అని అర్థం, The అంటే "ఆ" అని అర్థం.

A మరియు An లను "Indefinite Articles" అని పిలుస్తారు, మరియు The ను "Definite Article" అని పిలుస్తారు.

A మరియు An లను Singular Words (ఏకవచనాలు) ముందే ఉపయోగించాలి.

A అనే Article ను ఎల్లప్పుడూ Consonant Sound (హల్లు శబ్దం) గల Singular Words (ఏకవచనాలు) ముందే ఉపయోగించాలి, An అనే Article ను ఎల్లప్పుడూ Vowel Sound (అచ్చు శబ్దం) గల Singular Words (ఏకవచనాలు) ముందే ఉపయోగించాలి.

The ను ప్రత్యేకమైన వ్యక్తి లేదా వస్తువు గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. The ను Vowel Sound, Consonant Sound ఉన్నా/లేకున్నా ఉపయోగిస్తారు, అలాగే The ను మనం Singular, Plural పదాల ముందు ఉపయోగించవచ్చు.

Indefinite Articles:

A మరియు An ను Indefinite Articles అని పిలుస్తారు. ఎందుకనగా A మరియు An ఖచ్చితమైన వ్యక్తిని/వస్తువుని సూచించదు కాబట్టి.

Eg:

1. He met a scientist yesterday.
2. She met an engineer yesterday.

          పైన ఉన్న మొదటి వాక్యంలో Scientist ను అతడు కలిశాడు అని ఉంది, కానీ ఏ రంగానికి సంబందించిన Scientist ను అతడు కలిశాడో లేదు. అలాగే రెండవ వాక్యంలో ఆమె ఒక Engineer ను కలిసింది అని ఉంది, కానీ ఏ Engineer ని కలిసిందో లేదు. కాబట్టి ఇలాంటి సందర్భాలలో Indefinite Articles అయిన A, An లను ఉపయోగించాలి.

Indefinite Article A హల్లు శబ్దం (Consonant Sound) గల ఏకవచన (Singular) పదాల ముందు ఉపయోగించబడుతుంది.

Eg: a book, a teacher, a cat, a computer etc..

Indefinite Article An అచ్చు శబ్దం (Vowel Sound) గల ఏకవచన (Singular) పదాల ముందు ఉపయోగించబడుతుంది.

Eg: an umbrella, an officer, an idiot, an indian etc..

Definite Article:

The ను Definite Article అని అంటారు. ఎందుకంటే అది ఖచ్చితమైన వ్యక్తిని/వస్తువుని సూచిస్తుంది కాబట్టి.

Eg:

He met the science teacher yesterday.
She met The computer science engineer yesterday.

The అనే Article ఏకవచన, బహువచన పదాల ముందు ఉపయోగించబడుతుంది. అలాగే దీనికి శబ్దంతో పని లేదు.

Eg: The musi river, The sahara desert, The golconda fort etc..



No Article:

          కొన్ని సందర్భాలలో ఏ Article ని కూడా ఉపయోగించకూడదు. అవి: భాషల పేర్లముందు, నెలల పేర్లముందు, వారల పేర్లముందు, ఆటల పేర్లముందు, వ్యక్తుల పేర్లముందు, పట్టణాల పేర్లముందు, దేశాల పేర్లముందు, వాహనాల పేర్లముందు, భోజనాల పేర్లముందు, వ్యాధుల పేర్లముందు, బంధుత్వాల పేర్లముందు, కాలాల పేర్లముందు, లెక్కించలేనివాటి పేర్లముందు.