Have to, Has to, Had to

(చేయాలి, చేయవలసిఉండెను)
(Lesson-11)
↶Previous Next↷

Have to, Has to, Had to:

           ప్రస్తుతం గని భవిష్యత్తులో గాని చేయవలసిన పనులను తెలియజేయడానికి Have to లేదా Has to ను వాడతారు.

Have to ను I, We, You, They (subject) కర్తలకు ఉపయోగిస్తారు. Has to ను He, She, It (subject) కర్తలకు ఉపయోగిస్తారు.

గతంలో "చేయవలసి ఉండేది" అని చెప్పాల్సిన సందర్భాలలో Had to ను ఉపయోగిస్తారు.

Had to ను అన్ని Subject (కర్త) లకు ఉపయోగిస్తారు.

వీటి ఉపయోగాన్ని క్రింది వాక్యాలలో గమనిద్దాం.

Sentences with Have to, Has to, Had to

I have to meet my friends now.
We have to talk to them tomorrow.
Sunitha has to cook rice now.
I had to give money to him.
They had to visit golkonda.