May, May be, Might

(Lesson-14)
↶Previous Next↷

May, May be, Might:

           భవిష్యత్తులో జరగబోయే వాటిని ఉహించి చెప్పుటకు అలాగే అనుమతి తీసుకునేటప్పుడు "May" ను ఉపయోగిస్తారు.

ఏదైనా ఒక వ్యక్తిగాని వస్తువుగాని ఫలానా దగ్గర ఉన్నది/ఉన్నారు అని చెప్పే సందర్భంలో (వ్యక్తి/వస్తువు యొక్క స్థితి గురించి చెప్పేటప్పుడు) "May be" ని ఉపయోగిస్తారు.

సందేహంతో కూడిన మాటలను (అవునో కాదో అనుమానం ఉన్న మాటలను) తెలియజేసే సందర్భంలో "Might" ను ఉపయోగిస్తారు.

ఈ స్ట్రక్చర్ ను ఉపయోగించి వ్రాసిన క్రింది వాక్యాలను గమనించండి.

Sentences using "May, May be, Might":

She may help you.
May i come in?
The phone may be inside the desk.
They may be at home now.
It might rain today.
He might come tomorrow.