varalakshmi vratham

వరలక్ష్మీ వ్రతం

వరలక్ష్మీ వ్రతం తెలుగులో

varalakshmi vratham in telugu

          శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం రోజున ముత్తైదువులు ఈ వ్రతం చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ భర్తలు యోగక్షేమాలతో ఉంటారని సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, కోరికలు నెరవేరుతాయని స్త్రీల నమ్మకం.

వరలక్ష్మీ వ్రతం వ్రత విధానం:

varalakshmi vratham procedure vidhanam

          ఈ వ్రతాన్ని ఆచరించాలనుకునేవారు గుడిలో లేదా ఇంట్లో కూడా ఆచరించవచ్చు.

వరలక్ష్మీ వ్రతం చేయటానికి కావలసిన పూజా సామాగ్రి

things/items needed in varalakshmi vratham

1. కలశం.
2. వస్త్రం.
3. బియ్యం.
4. తమలపాకు.
5. పసుపు కుంకుమ.
6. 5 వరుసల దారం.
7. అగరబత్తులు.
8. కొబ్బరికాయలు.
9. 5 రకాల పూలు, 5 రకాల పండ్లు.
10. అరటి పండ్లు.
11. తమలపాకులు, వక్కలు.
12. కర్పూరం.
13. ఆవు నెయ్యి.
14. దీపాలు.
15. తీపి పదార్తాలు.
16. జాకెట్ ముక్కలు.
17. మామిడి ఆకులు.
18. ఆవు పాలు / పంచామృతం.

          ఇలా సమకూర్చుకున్న తరువాత, ముందుగా పూజా గదిని మామిడి తోరణాలతో పులా వరుసలతో అలంకరించాలి. పూజా చేయవలసిన స్థలాన్ని శుభ్రం చేసి, వరి పిండితో ముగ్గు వేయాలి. ఈ ప్రదేశంలో బియ్యం పోసి, దానిపై కలశాన్ని ఉంచాలి.

          కలశాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి నీటిని పోసి, మామిడి కొమ్మను అందులో ఉంచాలి. ఇప్పుడు ఈ మామిడి ఆకులపై కొబ్బరి కాయను నిలువుగా ఉంచాలి. కొబ్బరికాయపై ఒక నూతన వస్త్రాన్ని త్రికోణాకారంలో చుట్టాలి. ఈ విధంగా తయారుచేసిన కలశాన్ని లక్ష్మీదేవిగా భావించాలి. గాజులు, పూలు, పసుపు కుంకుమలు, బొట్టు, బంగారు ఆభరణాలతో లక్ష్మీ దేవిని అలంకరించాలి.

ఇప్పుడు కంకణాన్ని తయారు చేసుకోవాలి.



కంకణం తయారు చేసుకునే విధానం

          తెల్ల రంగు దారాన్ని 5 లేదా 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేదా 9 ముడులు వేయాలి. దీన్ని పీఠం వద్ద ఉంచి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి పూజించుకోవాలి. కంకణాన్ని తయారు చేసుకున్న పిమ్మట వ్రత నిర్వహణకు సిద్ధం కావాలి.

గణపతి పూజ

     వ్రతాన్ని ఆరంబించటం గణపతి పూజతో ఆరంభం అవుతుంది. పసుపుతో గణపతిని తయారు చేసుకోవాలి. వ్రతం పై ఉంచి పూజించాలి. గణపతి పూజ వల్ల వ్రతం ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి అవుతుంది. వినాయకుడి పూజ ముగిసిన తరువాత అక్షింతలు తలపైన చల్లుకోవాలి. ఇప్పుడు వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

వరలక్ష్మీ పూజా విధానం

varalakshmi puja vidhanam

          కలశంలో ఉన్న నీటిని పుష్పంతో పంచి దేవుడిపై పూజా సామగ్రిపైన, వ్రతం ఆచరించేవారు తమపైన చల్లుకోవాలి. తరువాత అక్షింతలు, పూలు వేస్తూ కలశానికి పూజ చేయాలి. ఇప్పుడు పుష్పాలతో వరలక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ అష్టోత్తర శతనామాలు పాడుకుంటూ పూజను నిర్వహించాలి. నామాలు పడిన తరువాత కంకణాన్ని అమ్మవారి దగ్గర ఉంచి అక్షింతలు వేస్తూ పూజ చేయాలి.



వరలక్ష్మీ వ్రతం పూజా సమయంలో వినవలసిన కథ

varalakshmi vratham katha

          పూర్వం మగధ రాజ్యంలో కుండినం అనే పట్టణంలో బంగారు గోడలు గల ఇంటిలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె తన భర్తను ఎంతో గౌరవించేది. భర్తను తన దైవముగా భావించేది, అత్తా మామలకు సేవలు చేసేది, ఓర్పును కలిగి ఉండేది. ఆమె పట్ల లక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది.

          ఒకరోజు లక్ష్మీదేవి చారుమతికి కలలో కనిపించి నేను వరలక్ష్మీ దేవిని, శ్రావణమాసంలో శుక్ల పక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నాకు వ్రతం నిర్వహించినట్లయితే నీకు కోరిన వరాలను ఇస్తాను అని చెప్పించి. దానితో చారుమతికి ఎంతో సంతోషం కలిగింది. మెలకువ వచ్చిన తరువాత అదంతా కల అని తెలుకున్నది. వెంటనే ఈ విషయాన్ని తన భర్తకు, అత్తా మామలకు చెప్పగా వారు ఆ వ్రతాన్ని ఆచరించమని చెప్పారు.

          మరునాడు చారుమతి ఇరుగు పొరుగు స్త్రీలకు కూడా ఈ విషయాన్ని వివరించింది. వారంతా ఎదురుచూస్తున్నా శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని చేయడానికి సిద్ధమయ్యారు, వారు వ్రతం చేసిన తరువాత నైవేద్యం సమర్పించారు. కంకణాలను ధరించారు, ప్రదక్షణలు చేసారు.

          ప్రదక్షిణాలు చేస్తుండగానే స్త్రీలందరు ఆభరణాలతో నిండిపోయారు. వరలక్ష్మీ వ్రతం ఆచరించిన వారందరూ సంపదలతో మురిసిపోయారు, చారుమతికి పొగడసాగారు.

          శివుడు, పార్వతీ దేవికి ఈ వ్రతాన్ని వివరించాడు. ఈ వ్రతం ఆచరించినా, ఈ కథ విన్నా, వ్రతాన్ని చేసేటప్పుడు చూసినా వారికి సకల సంపదలు కలుగుతాయి. ఈ కథ తరువాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి, కంకణాలను ధరించాలి. ప్రదక్షిణలు చేయాలి.



వరలక్ష్మీ వ్రతం పూజ అనంతరం చేయవలసిన పనులు

          ఈ వ్రతం కథ విన్నా తరువాత అక్షింతలు తలపై వేసుకోవాలి. ఆ తరువాత పూజకు వచ్చిన ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాంబూలాలు ఇవ్వాలి. అందరూ తీర్థం, ప్రసాదం స్వీకరించాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యం తినాలి. ఆ రోజున రాత్రి ఉపవాసం పాటించాలి.

వరలక్ష్మీ వ్రతం విశిష్టతలు

advantages of varalakshmi vratham

» ఈ వ్రతం చేయటం వల్ల లక్ష్మీదేవి దయ మనపై ఉంది సకల సంపదలు కలుగుతాయి.
» అనగా ధాన్యం, గుణాలు, జ్ఞానము మొదలగు సంపదలు సిద్ధిస్తాయి.
» ముత్తైదువులు నిత్యా సుమంగళిగా ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.


తెలుగు లింగాష్టకం    వరలక్ష్మీ వ్రతం    శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము    తెలుగు హనుమాన్ చాలీసా    మరిన్ని ..