Podupu Kathalu in Telugu

తెలుగు పొడుపు కథలు

నాలుగు కాళ్ళున్నాయి కాని జంతువుని కాను, శరీరమంతా రంధ్రాలున్నాయి కాని వలను కాను?
సమాధానం :
మంచము

పాలు కాని పాలు, ఏమి పాలు?
సమాధానం :
లోపాలు

నీరు తగిలితే గుప్పెడవుతుంది, ఎండ తగిలితే గంపెడవుతుంది?
సమాధానం :
దూది

పురము కాని పురము, ఏమి పురము?
సమాధానం :
గోపురము

నీతో దెబ్బలు తిన్నాను, నిలువునా ఎండిపోయాను, నిప్పుల గుండము తొక్కాను, గుప్పెడు బూడిదనయ్యాను?
సమాధానం :
పిడక

ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు?
సమాధానం :
నీడ

నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను?
సమాధానం :
గుడి గంట

నారి కాని నారి, ఏమి నారి?
సమాధానం :
పిసినారి

నిప్పు నన్ను కాల్చలేదు, నీరు నన్ను తడపలేదు, సూర్యుడితో వొస్తాను, సూర్యుడితో పోతాను?
సమాధానం :
నీడ

పేడ కాని పేడ, ఏమి పేడ?
సమాధానం :
దూద్ పేడ



నాది నాకు కనపడదు, నీది నీకు కనపడదు, ఏమిటది?
సమాధానం :
వీపు

సందు కాని సందు, ఏమి సందు?
సమాధానం :
పసందు

నీటి మీద తేలుతుంది కాని పడవ కాదు, చెప్పకుండా పోతుంది కాని జీవి కాదు, మెరుస్తుంది కాని మెరుపు కాదు?
సమాధానం :
నీటి బుడగ

నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకు కత్తిని తెస్తే కాని మళ్ళీ నడవదు?
సమాధానం :
పెన్సిల్

పండ్లున్నా నోరు లేనిది, ఏమిటది?
సమాధానం :
రంపం

రాయి కాని రాయి, ఏమి రాయి?
సమాధానం :
పావురాయి

Page-4